Nigeria : నైజీరియాలో శుక్రవారం రెండు అంతస్తుల పాఠశాల తరగతులు జరుగుతుండగా కూలిపోవడంతో 22 మంది విద్యార్థులు మరణించారు. నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆఫ్రికా దేశమైన నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల పలు పట్టణాలు, గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి.