‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగువారి మనసుల్ని దోచుకున్నాడు దర్శకుడు శశి. అతని తాజా చిత్రం ‘సివప్పు మంజల్ పచ్చై’ను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో డబ్ చేసి, ఎ. ఎన్. బాలాజీ ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శశి మాట్లాడుతూ, ”నేను గతంలో రూపొందించిన ‘శ్రీను, రోజాపూలు, బిచ్చగాడు’ చిత్రాలు తెలుగు వారిని ఆకట్టుకున్నాయి. సెంటిమెంట్ సినిమాలంటే టాలీవుడ్ ఆడియెన్స్ ప్రాణమిస్తారు. అదే నమ్మకంతో నేను తమిళంలో తీసిన ‘సివప్పు మంజల్ పచ్చై’…