పిడికెడు సినిమాలు తీసినా, గంపెడు పేరు సంపాదించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ నాటి క్రేజీ డైరెక్టర్స్ లో అనిల్ తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారు. నవ్వించి, కవ్వించడంలో అందెవేసిన చేయి అనిపించుకున్నారు అనిల్. వినోదం కోరుకొనే వారికి నూటికి నూరుపాళ్లు సంతృప్తిని కలిగించడమే ధ్యేయంగా సాగుతున్నారాయన. ప్రేక్షకుడు కొన్న టిక్కెట్ కు సరిపడా సంతోషాన్ని అందించి మరీ పంపించడం అలవాటుగా చేసుకున్నారు. అనిల్ సినిమాలను చూసినవారెవరైనా ఆ మాటే అంటారు. అనిల్ రావిపూడి 1982 నవంబర్…
చిత్రసీమలో ‘గురువు’ అని అందరిచేతా అనిపించుకున్నవారు దాసరి నారాయణరావు అయితే, సినిమా రంగంలో పరిచయం ఉన్నవారినల్లా ‘గురువా’ అంటూ సంబోధించేవారు ముత్యాల సుబ్బయ్య. చిత్రసీమను నమ్ముకుంటే ఏదో ఒకరోజు రాణించవచ్చునని పలువురు నిరూపించారు. ముత్యాల సుబ్బయ్య సైతం అలా నిరూపించిన వారే. టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు తీసి, ఘనవిజయాలను చూసినా, తనదైన పంథాలోనే పయనిస్తూ ‘గురువా…’ అంటూనే సాగారు. ప్రస్తుతం సుబ్బయ్య చేతిలో సినిమాలు లేవు. కానీ, ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు ఈ…