కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. కార్పొరేట్ల కంపెనీల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 23.51 శాతం పెరిగి 8. 65 లక్షల కోట్ల రూపాయలకుకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తెలిపింది.
Today (13-02-23) Business Headlines: మనోళ్లే మార్కెట్ ఓనర్లు: ఇండియన్ ఈక్విటీ మార్కెట్’లో డొమెస్టిక్ ఇన్వెస్టర్ల ఓనర్’షిప్.. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్’లో లైఫ్ టైమ్ హయ్యస్ట్ లెవల్’కి చేరుకుంది. అంటే.. 24 పాయింట్ నాలుగు నాలుగు శాతంగా నమోదైంది. వరుసగా ఐదో త్రైమాసికంలో కూడా గ్రోత్ నెలకొనటం విశేషం. ఈ యాజమాన్యం.. వ్యక్తులు మరియు సంస్థలది కావటం గమనించాల్సిన విషయం. ఇదిలా ఉండగా.. రిటైల్ ఇన్వెస్టర్ల ఓనర్’షిప్ మాత్రం సున్నా పాయింట్ ఒకటీ ఒకటీ శాతం తగ్గింది.
ఆస్తులు అమ్ముతున్న రెడ్డీస్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నెదర్లాండ్స్‌లోని కొన్ని ఆస్తులను మరియు అప్పులను విక్రయించబోతోంది. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన డెల్‌ఫార్మా గ్రూపుతో ఒపందం చేసుకుంది. ఈ సంస్థకు నెదర్లాండ్స్‌లో డాక్టర్ రెడ్డీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బీవీ పేరుతో అనుబంధ సంస్థ ఉంది. దీనికి సంబంధించిన ఆస్తులను, రుణాలను అమ్మటంతోపాటు ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.