Cricketers Retirement in 2024: 2024 సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్‌లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్‌తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ ఆట జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 12 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర…
Virat Kohli Hails Dinesh Karthik: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డీకే రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కార్తిక్‌ను ఓదార్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డీకేతో తనకున్న అనుబంధంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తొలిసారి డీకేను కలిసిన సందర్భంగా ఇంకా గుర్తుందన్నాడు. సమస్యను…
Happy Retirement DK Tag Trend in X: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు గుడ్ బై చెప్పాడు. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన అనంతరం డీకే తన ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మైదానం నుంచి డగౌట్‌కు వెళుతుండగా.. కార్తీక్ తన గ్లౌజులు తీసి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో…
Dinesh Karthik Set to Retire After IPL 2024: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు డీకే వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 అతడికి చివరి టోర్నీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా దినేశ్ కార్తిక్ గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో డీకే ఆడాడు. ఆ టోర్నీలో విఫలమవడంతో…
భారత వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ క్రికెట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి కార్తీక్ ఆలోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది.