Dinesh Karthik-Virat Kohli: థ్యాంక్యూ డీకే.. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా: కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Hails Dinesh Karthik: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డీకే రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కార్తిక్‌ను ఓదార్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డీకేతో తనకున్న అనుబంధంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తొలిసారి డీకేను కలిసిన సందర్భంగా ఇంకా గుర్తుందన్నాడు. సమస్యను ఎలా అధిగమించాలనేదానిపై అవగాహన కల్పించాడని, ఆ అమూల్యమైన సలహాకు ఎప్పటికీ రుణపడి ఉంటా అని విరాట్ పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘నేను తొలిసారి దినేష్ కార్తిక్‌ను కలిసిన సందర్భంగా ఇంకా గుర్తుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఇద్దరం ఆడాం. 2009 ఛాంపియన్స్ ట్రోఫీ అది. డీకేతో కలిసి మొదటిసారి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నా. ‘కార్తీక్ చాలా సరదాగా ఉంటాడు. అయితే హైపర్ యాక్టివ్. కన్‌ఫ్యూజ్డ్ పర్సన్ కూడా. ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు’ డీకేపై నాకు కలిగిన తొలి ఇంప్రెషన్ ఇదే. డీకే అద్భుతమైన ప్రతిభావంతుడు. అప్పటికీ ఇప్పటికీ అతడిలో ఏ మార్పులేదు. మైదానం వెలుపల అతడి సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. చాలా విషయాలపై మంచి నాలెడ్జ్ ఉంటుంది. క్రికెటేతర అంశాల గురించీ చెబుతాడు’ అని తెలిపాడు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్‌మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Also Read: BCCI-India Coach: ఆస్ట్రేలియా మాజీలకు కౌంటర్.. టీమిండియా కొత్త కోచ్‌పై జై షా హింట్!
‘ఐపీఎల్ 2022 సీజన్ నాకు గొప్పగా ఏమీ లేదు. ఆత్మవిశ్వాసం విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు డీకే నా పక్కనే కూర్చొని నా సమస్యను వివరించాడు. దాన్ని ఎలా అధిగమించాలనేదానిపై సూచన ఇచ్చాడు. థ్యాంక్యూ డీకే.. నీ సలహాలతో మెరుగ్గా రాణించగలుగుతున్నా. నీకు ఎప్పటికీ అతడికి రుణపడి ఉంటా’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో డీకే 15 మ్యాచుల్లో 326 పరుగులు చేశాడు. ప్రపంచకప్ 2024లో చోటు దక్కించుకోవడంలో కుర్రాళ్లకు పోటీదారుగా నిలిచిన డీకే.. వయసురీత్యా అవకాశం అందుకోలేకపోయాడు. 38 ఏళ్ల డీకే ఇప్పటివరకు భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!