దేశంలో దొంగనోట్లు వరదలా వచ్చిపడుతున్నాయి..ఎటు చూసినా దొంగనోట్ల ముఠాలే పట్టుబడుతున్నాయి.. చేతిలోకొచ్చే ప్రతి కరెన్సీ నోటు అసలుదా, నకిలీదా అని చెక్ చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని… రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోదామని అనుకునేవాళ్లు పెరుగుతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు.. దేశమంతా అనేక చోట్ల నకిలీ నోట్లకు అడ్డాలు తయారవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పనక్కర్లేదు. అటు కావలి నుండి ఇటు శ్రీకాకుళం వరకు… ఇటు సత్తుపల్లి నుండి హైదరాబాద్ వరకు…