మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ సినీ గేయ రచయిత ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూసి చలించి రాసిన పాట.
బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ (72) హఠాన్మరణం చెందారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి చీస్తా కొచ్చర్ (33) ప్రాణాలు కోల్పోయారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కొచ్చర్ పీహెచ్‌డీ చేస్తున్నారు.
హైదరబాద్ నగర శివారులోని నార్సింగ్ లో హిట్ అండ్ రన్ ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆర్మీ ఉద్యోగి కునాల్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా(28) చిన్న వయసులోనే (Rinky chakma) ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ శుక్రవారం ఆమె ఈ లోకాన్ని విడిచారు.
ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ (72) అనారోగ్యంతో మరణించారు. సోమవారం ఉదయం మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఉదయం 11 గంటల ప్రాంతంలో మరణించారని చెప్పారు. పంకజ్ ఉదాస్ మరణవార్తను చాలా బరువెక్కిన హృదయంతో మీకు తెలియజేసేందుకు చింతిస్తున్నామని ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ ఓ ప్రకటనను పోస్ట్ చేశారు.
దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఇన్‌స్టిట్యూట్ మరో ఆత్మహత్య వార్త సంచలనం రేపుతుంది. నెల రోజుల్లో ఇది ఆత్మహత్య ఘటన. ఇంతకు ముందు కొన్ని రోజుల్లోనే రెండు ఆత్మహత్య ఘటనలు నమోదయ్యాయి. ఆత్మహత్యలకు ప్రసిద్ధి చెందిన కాన్పూర్ ఐఐటీలో మరోసారి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సంస్థ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రియాంక అనే పీహెచ్‌డీ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారితో పాటు ఫోరెన్సిక్ బృందం…
జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షడు, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండె పోటుతో మరణించారు. హనుమకొండలోని చైతన్యపురిలో సంపత్ రెడ్డి ఇంట్లో ఉండగానే హార్ట్ ఎటాక్ వచ్చింది.