స్టార్ ఇండియన్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా గురువారం మరో చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత తొలి క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు.
Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రో ఆటగాడు, ఒలింపిక్ ఛాంపియన్ 24 ఏళ్ల నీరజ్ చోప్రా ప్రఖ్యాత డైమండ్ లీగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నీరజ్ చోప్రా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లోని సుసానెలో జరుగుతున్న డైమండ్ లీగ్‌లో మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.08 మీటర్ల దూరం విసిరి అందరికంటే ముందంజలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 85.18 మీటర్ల దూరం వేశాడు. మూడో ప్రయత్నంలో…
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రతి ఈవెంట్‌కు మెరుగువుతున్న అతడు స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లోనూ మెరిశాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి రజత పతకం కైవసం చేసుకున్నాడు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో గురువారం జరిగిన డైమండ్ లీగ్ పోటీలో పాల్గొన్న నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనేడియన్ అథ్లెట్ అండర్సన్ పీటర్సన్ 90…