తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటనకు, గంభీరమైన డైలాగ్ డెలివరీకి పెట్టింది పేరైన ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ ఇండస్ట్రీలో యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ అర్హతను గుర్తించిన పూణెలోని ప్రతిష్ఠాత్మక ఆంధ్ర సంఘం, ఆయనను ఘనంగా సత్కరించి గౌరవప్రదమైన క్షణాలను అందించింది. ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో సాయి కుమార్‌తో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి కుమార్‌ను ‘అభినయ వాచస్పతి’ అవార్డుతో…
Golden Jubilee: డైలాగ్ కింగ్, అజాత శత్రువు సాయికుమార్ కు యాభై యేళ్ళు! అదేమిటీ ఆయన పుట్టింది 1960లో కదా అని కొందరికి అనుమానం రావచ్చు. బట్.... నటుడిగా ఆయనకు ఇది 50వ సంవత్సరం. పన్నెండేళ్ళ చిరు ప్రాయంలో తొలిసారి మయసభలోని దుర్యోధనుడి పాత్ర కోసం ముఖానికి రంగు వేసుకున్నారు సాయికుమార్. ఆ తర్వాత బాలనటుడిగా, యువ నటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాభై సంవత్సరాల పాటు వివిధ భాషల్లో వందలాది చిత్రాలలో నటించారు.