FAPTO Protest: ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కుల కోసం ఫ్యాప్టో (FAPTO) పిలుపు ఇచ్చింది.. ఇవాళ ఉదయం 10 గంటలకు ధర్నాచౌక్ లో FAPTO పోరుబాట నిరసన ధర్నా చేపట్టనుంది.. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ధర్నాకు సిద్ధం అయ్యారు ఉపాధ్యాయులు.. విజయవాడ ధర్నా చౌక్ కు వేలాది మంది ఉపాధ్యాయులు తరలిరానున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని టీచర్లు విమర్శిస్తున్నారు.. Read…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఎలక్షన్ కమిషన్‌పై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ యుద్ధం ప్రకటించారు. అధికార పార్టీ-ఎన్నికల కమిషన్ ఓట్ల కుట్రకు పాల్పడుతున్నారని గురువారం ఇండియా కూటమి సమావేశంలో ఆరోపించారు.
BRS Maha Dharna: మహబూబాబాద్ పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున అనుమతి నిరాకరించడంతో బీఆర్‌ఎస్ కూడా ధర్నాను వాయిదా వేసింది.
ప్రేమ మత్తులో పడి యువతకు కళ్ళు మూసుకుపోయాయి. వయసులో ప్రేమకు ఆకర్షణకు మధ్య తేడా తెలియక చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు మోసపోతున్నారు. ప్రేమించిన వారి కోసం ఇంటి నుంచి పారిపోయి తల్లిదండ్రులను బాధ పెట్టే వారు కొందరైతే.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆత్మహత్యలు చేసుకున్న వారు మరి కొందరు.
తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చులేకపోతుందని ఏపీ జేపీసీ ఆరోపిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు, IR ఇవ్వకపోడంతో ఏపీ జేపీసీ ఉద్యమ బాట పట్టింది. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని జేఏసీ నేతలు చెబుతున్నారు.
Telangana Elections: కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలింగ్ బూత్ ఎదుటే ధర్నాకు దిగారు. పలు పోలింగ్ కేంద్రాల్లోకి స్థానికేతరుడైన రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చొరబడి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు.
జగిత్యాలలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ జగిత్యాల అష్టదిగ్బందంకు గ్రామాల ప్రజలు పిలుపునిచ్చారు. మాస్టర్ ప్లాన్ వద్దని కాంగ్రెస్ బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా నిలిచారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని.. తెలంగాణ రైతులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, వారితో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు కేంద్రం వైఖరికి నిరసనగా ఉద్యమించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.