సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో అనేక రూమర్లు, పుకార్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బ్రతికే ఉన్న ఆయన గురించి అసత్య ప్రచారం చేయడంతో కుటుంబ సభ్యులు స్పందించి “ధర్మేంద్రగారు ఆరోగ్యంగా ఉన్నారు, దయచేసి రూమర్లు ప్రచారం చేయొద్దు” అని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ధర్మేంద్ర గారు తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ, డాక్టర్ల సూచనల మేరకు మందులు తీసుకుంటున్నారు.…
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) గత కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయన చనిపోయాడంటూ మీడియా సంస్థలు వార్తలు రాశాయి. నవంబర్ 11 ఉదయం ధర్మేంద్ర భార్య హేమ మాలిని, కుమార్తె ఇషా డియోల్ ఆయన చనిపోలేదని.. బ్రతికే ఉన్నారంటూ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 12న ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. Read Also: Verizon to Lay Off: 15వేల మంది ఉద్యోగులను…