ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర (89) గత కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయన చనిపోయాడంటూ మీడియా సంస్థలు వార్తలు రాశాయి. నవంబర్ 11 ఉదయం ధర్మేంద్ర భార్య హేమ మాలిని, కుమార్తె ఇషా డియోల్ ఆయన చనిపోలేదని.. బ్రతికే ఉన్నారంటూ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 12న ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
Read Also: Verizon to Lay Off: 15వేల మంది ఉద్యోగులను తొలగించనున్న వెరిజోన్ టెలికాం కంపెనీ..
అయితే ధర్మేంద్ర.. అతడి కుటుంబం సభ్యులు ఐసీయూలో ఉండగా తీసిన ఓ వీడియో లీక్ అయ్యింది. అప్పటి నుండి ధర్మేంద్ర ఇంట్లో కోలుకోవడంపై కుటుంబం దృష్టి సారించింది. ధర్మేంద్రకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అభిమానులు ఆయన గురించి ఆందోళన చెందవద్దని తెలిపారు. ప్రస్తుతం వీడియో తీసిన ఆసుపత్రి ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేప్టటారు పోలీసులు.
Read Also:Avocado vs Amla: అవకాడో వర్సెస్ ఉసిరి.. ఈ రెండింటిలో దేనితో ఎక్కువ లాభాలున్నాయంటే..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆసుపత్రి లోపల నుండి డియోల్ కుటుంబాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ధర్మేంద్ర హాస్పిటల్ బెడ్ పై అపస్మారక స్థితిలో ఉన్నాడు. అయితే బాబీ డియోల్, సన్నీ డియోల్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ధర్మేం బెడ్ చుట్టూ చేరి బాధపడుతుండగా.. ఆసుపత్రిలోని ఓ ఉద్యోగి వీడియో తీసాడు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఐసీయూ లోపల వీడియో తీసిన వ్యక్తి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.