ఆ ఎమ్మెల్యేది గిలిచిందాకా ఒక తీరు, కుర్చీలో కూర్చున్నాక మరో రీతి అన్నట్టుగా ఉందా? నాడు అష్టకష్టాలు పడి గెలిపించినవాళ్ళే నేడు దూరం అవుతున్నారా? ఎమ్మెల్యే ఆయనా? ఆయన కూతురా అన్నది తెలియకుండా పోయిందా? ఏ నియోజకవర్గంలో జరుగుతోందా వ్యవహారం? ఎవరా శాసనసభ్యుడు? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో నరసన్నపేట నియోజకవర్గం రూటే సపరేట్. ధర్మాన బ్రదర్స్‌కు కంచుకోట ఇది. అలాంటి కోటను గత ఎన్నికల్లో బద్దలు కొట్టారు బగ్గు రమణమూర్తి. టీడీపీ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే…