మంత్రి పదవి కంటే తనకు తన ప్రాంతమే ముఖ్యం అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం సిల్వర్ జుబ్లీ హాల్ ఆర్ట్స్ కాలేజీలో సిక్కోలు స్వచ్చంద సంస్దల సారధ్యంలో మన రాజధాని – మన విశాఖ సదస్సు జరిగింది. మంత్రి ధర్మన ప్రసాదరావు మాటాడారు. ఏపీ విభజన చట్టంలో పదేళ్ళు రాజధానిగా హైదరాబాద్ ఉంది. అది వదిలేసి చంద్రబాబు ముడు నెలల్లో వచ్చేసాడు. శివరామకృష్ణ కమిటీ పెద్ద క్యాపిటల్ వద్దని సలహా ఇస్తే ..చంద్రబాబు తాబేదారులు చెప్పే విజయవాడ- గుంటూరు లో రాజధానే వద్దన్నారు. ఒక్కచోట అభివృద్ది వద్దని శ్రీబాగ్ ఒడంబడిక నాడే అభిప్రాయాలు వచ్చాయి. దేశంలో చాలా రాష్ర్టాలలో హైకోర్ట్ ఒక దగ్గర , పరిపాలనా రాజధాని ఒకదగ్గర ఉన్నాయి. మంత్రి ఉద్యోగం కంటే నాకు ఈ స్దితికి తీసుకువచ్చిన ప్రజలే ముఖ్యం అన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
అభివృద్ధిలో హెచ్చుతగ్గులు ఉండకూడదని ఒక సూత్రం నేడు ప్రపంచం పాటిస్తుంది. రాజ్యాంగం చెబుతున్నా , కమిటీలు చెబుతున్న చంద్రబాబు ఎందుకు పెద్ద క్యాపిటల్ చేసారు..?చంద్రబాబు వేసిన నారాయణ కమిటి ఎవరితో చర్చించింది. రియల్ ఎస్టేట్ కోసం అమరావతి చుట్టూ ఉన్న భూములు బాబు , బాబు బందువులు కొనుగోలు చేసారు. ఐదుకోట్ల ప్రజల తలకాయలు బలి ఇవ్వడానికి బాబు సిద్దపడ్డారు.చంద్రబాబుకి ఒక్క రియల్ ఎస్టేట్ తప్ప ఏం పట్టదు. రాష్ర్టంలో ఉన్న ఏకైక పెద్ద పట్టణం విశాఖ. రాజధానికి అవకాశం ఉన్న ఒకే పట్టణం విశాఖ.చంద్రబాబు హైదరాబాద్ వదిలి రారు.. కానీ ఇక్కడ ఉన్న నేతలకు ఏం అయ్యింది. చంద్రబాబు కు అనుగుణంగా మాటాడటానికి సిగ్గు లజ్జా ఉందా? మూడు రాజధానులు అనేది మాటాడడానికే… ప్రధానమైన పరిపాలనా రాజధాని విశాఖనే. అభివృద్ధి మధ్య వ్యత్యాసాలు ఉంటే ప్రమాదం అన్నారు ధర్మాన.
Read Also: Cable Bridge Collapse: ఆ బాధ వర్ణనాతీతం.. వంతెన ఘటనపై మోడీ ఆవేదన
మేం మా భూములు కోల్పోయాం. 99 శాతం అభివృద్ధి చెందిన ప్రాంతాలనుంచి వచ్చిన వారే సంస్దలు పెట్టారు. మీ అభివృద్ధి అనేది మాపీక కోస్తుంది. మీరు యజమానులు , మేం కూలీలుగా గేట్ కాపలాదారుగా ఉన్నాం. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్ల తరువాత ఇలా ఉండటం అన్యాయం కాదా..? పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే సెన్సస్ లో శ్రీకాకుళం వెనకబడే ఉంటుంది. అడగకపోతే అభివృద్ధి చేయరా? జగన్ మాత్రమే అడకపోయినా క్యాపిటల్ ప్రకటించారు.. మనం చప్పట్లు కొట్టి ఆహ్వానించాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Bandi Sanjay: తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీలుస్తోందంటే వల్లభాయి పటేల్ కారణం