Cm Jaganmohan Reddy: రైతన్నల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవనిగడ్డలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 75 ఏళ్ళ స్వాతంత్ర్యం అనంతరం కూడా భూ సరిహద్దులు రికార్డులు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. భూ యాజమాన్య రికార్డులు లేకపోవడం వల్ల ఇక్కట్లు పడుతున్నాం. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతూ.. ధర్నాలు, నిరాహారదీక్షలు చేస్తున్నారు రైతులు. మానసిక వేదన అంతా ఇంతా కాదు. మన కళ్ళ ఎదుటే కనిపించినా గత ప్రభుత్వాలు ఏం చేయలేదు. రాష్ట్రంలో భూరీసర్వేలు చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.
నిషేధిత భూముల జాబితా నుండి షరతు గల పట్టా భూముల తొలగింపు కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. రైతులతో ముచ్చటించారు. 22,042 మంది రైతులకు ఈ విధానం వల్ల లబ్ధి చేకూరనుంది. రైతులతో కలిసి జగన్ ఫోటోలు దిగారు. 15వేలమంది సర్వేయర్లను రిక్రూట్ చేశాం. అత్యాధునిక పరికరాలు కొన్నాం. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగే రైతులకు భూపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. బహిరంగ సభలో ప్రసంగించారు.
Also Read
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు సీఎం జగన్ అందజేశారు. 1500 గ్రామాల్లో భూసర్వేలు పూర్తిచేస్తాం. మన గ్రామాల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండాలి. మన భూములు వేరే వాళ్ళ మీద మారిస్తే తెలిసిపోతుంది. గొప్ప కార్యక్రమం నవంబర్ లో ప్రారంభం అవుతుందన్నారు సీఎం జగన్. ఈ నిర్ణయం వల్ల రైతులు పిల్లలకు బహుమతిగా ఇవ్వవచ్చు. అమ్ముకోవచ్చు… లీజుకి ఇవ్వవచ్చు.
అన్ని రకాల హక్కులు రైతన్నలకు చెందుతాయి. హక్కుపత్రాలు మీ చేతికి అందుతాయి. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల గ్రామాల్లో సర్వే యఙం పూర్తి అవుతుంది. 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేస్తున్నాం. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాను. ఈ ఊర్లో క్లియరెన్స్ పత్రాలను జారీ చేస్తున్నాను. 35 వేల 600 ఎకరాల భూములకు పరిష్కారం చూపినట్లు అవుతుంది. దీని వల్ల సుమారుగా 22 వేల మంది రైతులకు వారి భూముల పై సర్వ హక్కులు రానున్నాయి. ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో 10, 019 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 15, 700 ఎకరాలకు ముక్తి లభించనుందన్నారు జగన్.
2016లో రైతన్నల వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వంలోనూ ఇప్పటి ప్రభుత్వంలోనూ తేడా ఏంటో తెలుసుకోవాలని కోరుతున్నాను. అసైన్డ్, ఆలయ భూముల్లో సాగుచేస్తున్నవారికి కూడా రైతు భరోసా ఇస్తున్నది మనమే. గత ప్రభుత్వం వంచిస్తే.. వారికి మంచి చేసింది మన ప్రభుత్వం. భూములు దోచుకోవాలని వాళ్ళు ఆలోచిస్తే… వారి భూములు వారికి ఇవ్వాలని ఆలోచిస్తున్నది మన ప్రభుత్వం.. రైతు మనసు తెలిసిన ప్రభుత్వం.. పేదవాడి బాగోగులు ఆలోచిస్తున్నాం.
వివక్ష లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించాలని తపన పడుతున్న ప్రభుత్వం. మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను 98 శాతం నెరవేర్చాం. 50 ఇళ్ళకు వాలంటీర్ ఉంటాడు. 1వతేదీ ఏదైనా లెక్కచేయకుండా పింఛన్లు ఇచ్చేస్తాడు. రైతు చేయి పట్టుకుని ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తుంది. విత్తనాలు, పెస్టిసైడ్స్ అన్నీ కల్తీ లేని వ్యవస్థ అమలవుతుంది. పంట కొనుగోలు విషయంలో రైతుకు భరోసా కల్పిస్తున్నాం.
తాజావార్తలు
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
ట్రెండింగ్
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!