తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి పోర్టల్‌కు రెండేళ్లు నిండాయి.. ధరణిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై నేటితో రెండేళ్లు పూర్తవుతుంది.. 2020 నవంబర్ 2న ప్రారంభించిన ధరణి భూ పరిపాలలో ఒక కొత్త అధ్యాయంగా చెప్పాలి.. ధరణికి ముందు రాష్ట్రంలో కేవలం 141 ప్రాంతాల్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగగా.. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏకంగా రాష్ట్రంలోని 574 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. ఇక, రిజిస్ట్రేషన్ల అనంతరం తమ భూములకు సంబంధించి రెవిన్యూ రికార్డుల్లో మ్యుటేషన్లు కూడా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.. అయితే, ధరణిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 26 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది..
Read Also: Pawan Kalyan: పవన్‌ని వెంబడిస్తున్న ఆగంతలు.. కారు ఆపి మరీ..
ఇప్పటి వరకు 11 .24 లక్షల అమ్మకపు ట్రాంజాక్షన్లు జరిగాయని.. 2 .81 లక్షల గిఫ్ట్ డీడ్‌లను జరిపి లక్షా 80 వేల లబ్దిదారులకు వారసత్వ ధ్రువీకరణ పత్రాలు అందజేసింది పేర్కొంది ప్రభుత్వం.. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నసమస్యలు కూడా ధరణిలో పరిష్కారమవుతున్నాయని చెబుతున్నారు.. గతంలో 2.97 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినా మ్యుటేషన్లు జరగలేదు… కానీ, ధరణి ప్రారంభంతో వీటికి పరిష్కారం లభించిందని.. భూ సంబంధిత 3.16 లక్షల వివాదాలను ప్రభుత్వం పరిష్కరించినట్టు పేర్కొన్నారు.. అయితే, ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు ఇప్పుడు పరిష్కారం అయ్యాయని కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు.. ధరణిపై విమర్శలు కూడా కొనసాగుతోన్న విషయం విదితమే.