స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ తర్వాత ఓటీటీలో విడుదలైన మరో పెద్ద సినిమా ‘జగమే తంత్రం’. ధనుష్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందనే వార్తలు వచ్చినప్పుడు ధనుష్ తో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సైతం ఖండించారు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోవడంతో చివరకు రాజీ పడాల్సి వచ్చింది. వైనాట్ పతాకంపై శశికాంత్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం…
ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావాల్సిన సినిమాలు పైరసీ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తమిళ స్టార్ ధనుష్ ‘జగమే తందిరం’ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే పైరసీ సైట్లలో దర్శనమిచ్చింది. నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అంతకు ముందే పలు వెబ్సైట్లలో కనిపించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సినిమాకి…
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల ట్వీట్ తో అనౌన్స్ చేశారు. తెలుగు,…
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్ పూర్తిగా వేరే. ఆయన సినిమా జోనర్స్ అన్నీ క్లాస్‌గా ఉంటాయి. అంతేకాదు కమర్షియల్ సినిమా తీస్తేనే జనం చూస్తారన్న రూల్స్ పెట్టుకోడు. సంవత్సరానికి ఇన్ని సినిమాలు చేయాలి అని లెక్కలేమీ ఉండవు. కొత్త వాళ్ళతో సినిమా చేసి హిట్ కొట్టగలడు. స్టార్స్ తో సినిమా తీసి హిట్ కొట్టగలడు. ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా సినిమా దర్శకుడిగా మారబోతున్నాడా? అంటే, అవుననే సమాధానం…
‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి హిట్ మూవీతో తెలుగు వారికి కూడా బాగానే పరిచయమైన దర్శకుడు సెల్వరాఘవన్. అయితే, కోలీవుడ్ లో ఆయన ఇంటెన్స్ మూవీస్ కి బోలెడు క్రేజ్ ఉంది. అక్కడ మంచి డిమాండ్ ఉన్న డైరెక్టర్ ఆయన. అయితే, కొన్నాళ్ల క్రితం తెర మీద కనిపించబోతున్నట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నటుడిగా సెల్వరాఘవన్ తొలి చిత్రం ‘సాని కాయిదమ్’లో కీర్తి సురేశ్ కనిపించబోతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు ఆమె…
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ ఇప్పటికే స్ట్రయిట్ తెలుగు సినిమాలలో నటించేశారు. విజయ్ ఆంటోని సైతం తెలుగులో తన చిత్రాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని స్ట్రయిట్ తెలుగు సినిమాలో తప్పకుండా నటిస్తానని చెబుతున్నాడు. ఇక ఇటీవల విజయ్ తో తెలుగు సినిమా తీయబోతున్నట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగు సినిమాలో నటించడానికి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. నిజానికి చాలా కాలం తమిళచిత్రసీమకే…
తమిళ స్టార్ నటుడు ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జగమే తందిరం’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. తాజాగా ‘జగమే తందిరం’ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. గ్యాంగ్‌స్టర్ పాత్రలో ధనుష్ మాస్ లుక్‌లో అదరగొట్టాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ నటుడు జేమ్స్ కాస్మో, సంచన నటరాజన్, జోజు జార్జ్, కలైరసన్, వడివక్కరసి కీలకపాత్రల్లో…
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన “జగమే తందిరం” చిత్రం ఓటిటిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్ ను ప్రకటించారు నిర్మాతలు. జూన్ 1న “జగమే తందిరం” ట్రైలర్ విడుదల కానుందని ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “జగమే తందిరం” 2020లో విడుదల కావాల్సి ఉంది కాని కోవిడ్ -19…
ధనుష్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ‘జగమే తంత్రం’ మూవీ మొత్తానికీ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా నిజానికి వేసవి కానుకగా థియేట్రికల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ లోగా వైనాట్ స్టూడియోస్ కు థియేటర్ల యాజమాన్యంకు మధ్య ఏర్పడిన చిన్నపాటి అగాథంతో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఈ లోగా కరోనా సెకండ్ వేవ్ సైతం బలపడటంతో…
ధనుష్ హీరోగా నటించిన ‘కర్ణన్’ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేశ్ దక్కించుకున్నారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా కోవిడ్ నిబంధనల ప్రకారం థియేటర్లలో ప్రదర్శించినా అద్భుతమైన విజయాన్ని సాధించటం విశేషం. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ధాను నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించారు. లాల్, నటరాజసుబ్రహ్మణ్యం, యోగిబాబు, లక్ష్మీప్రియ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. వి…