కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘జగమే తందిరం’ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో విభిన్నమైన స్పందన వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం ఇండియాలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల్లో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది “జగమే తందిరం”. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో “సురులి” అనే గ్యాంగ్ స్టార్ గా కన్పించి తుఫాన్ సృష్టిస్తున్నాడు ధనుష్. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన “జగమే తందిరం” చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు.
Also Read : అశోక్ గల్లా మూవీ అప్డేట్… త్వరలోనే టైటిల్ టీజర్
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటించగా… దీనిని నెట్ ఫ్లిక్స్ లో దాదాపు 190 దేశాల్లో, 17 భాషల్లో భారీ రేంజ్ లో విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రం “జగమే తంత్రం”గా రిలీజ్ అయ్యింది. సురులి (ధనుష్) అనే చిన్న గ్యాంగ్ స్టర్ శివదాస్ అనే వ్యక్తిని చంపే కాంట్రాక్టు పని మీద లండన్ వెళ్తాడు. ఆ పనిని సురులికి పీటర్ అనే వ్యక్తి అప్పగిస్తాడు. శివదాస్ తమిళులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు వివిధ దేశాల నుండి వచ్చిన శరణార్థులనుకాపాడతాడు. శివదాస్ ను సురులి అంతం చేశాడా? శివదాస్ ను నమ్ముకుని లండన్ వచ్చిన తమిళ శరణార్థుల పరిస్థితి ఏమైంది? చివరికి ఏం జరుగుతుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.