టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ తో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ గా రౌడీ బేబి సాయి పల్లవి నటించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “ఫిదా, లవ్ స్టోరీ” చిత్రాలలో సాయి పల్లవి నటించింది. ఇప్పుడు వస్తున్న వార్తలు గనుక నిజమైతే ఈ చిత్రం శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ అవుతుంది.
Also Read : పిక్స్ : మెరిసిపోతున్న చందమామ… కాజల్ బర్త్ డే
ఇక మరోవైపు సాయి పల్లవి మెహేంది వేసుకున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఎల్లో కలర్ డ్రెస్ లో ఉన్న సాయి పల్లవి చేతులు, కాళ్ళకు మెహేంది పట్టుకొని కన్పిస్తోంది. కాగా అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా అనేసరికి అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు, తమిళ, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్వీసీఎల్ఎల్ పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్ డీటెయిల్స్ త్వరలో ప్రకటించనున్నారు.