Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు కోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా కదిరేశన్, మీనాక్షి అనే జంట.. ధనుష్ మా కుమారుడే అని న్యాయపోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. 2016లో మధురై మేలూరు కోర్టులో ఈ కేసు మొదలయ్యింది. సినిమాలపై ఆసక్తితో ధనుష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, ఎప్పటినుంచో వెతుక్కుంటూ వస్తే.. ఇప్పుడు దొరికాడని చెప్పుకొచ్చారు.