మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం ‘ఖిలాడీ’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా… ‘తగ్గేదే లే’ అంటూ ముందుకు సాగిపోతున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. తాజాగా రవితేజతో ‘ధమాకా’ మూవీని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కొత్త షెడ్యూల్ ను షురూ చేశాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కు చెందిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీ విజయపథంలో సాగిపోతుండటంతో వారి ఆనందానికి హద్దులు…