Shahjahan Bhuiyan: షాజహాన్ భుయాన్(74) బంగ్లాదేశ్ లో పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏకంగా 26 మంది దోషులను, యుద్ధ నేరస్తునలు ఉరితీశాడు. తాజాగా ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. దోపిడి, హత్య నేరాలకు గానూ దాదాపుగా 42 ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడు దశాబ్ధాలు జైలులో శిక్ష అనుభవించిన భూయాన్ తాజాగా ఆదివారం విడుదయ్యాడు. ‘ద హాంగ్ మాన్’గా పిలుచుకునే భూయాన్ కు 2001లో జైలు అధికారులు ఉరితీసే ఉద్యోగం ‘తలారి’గా నియమించారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రసిద్ధ క్లాత్ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది, ఫలితంగా భారీ నష్టం జరిగింది. ఢాకాలోని ప్రసిద్ధ బట్టల మార్కెట్ అయిన బంగా బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పరిసరాలను నల్లటి పొగతో కప్పివేసింది.
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లోని శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోవడంతో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు.
బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు సంభవించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో గల గులిస్థాన్ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలో జరిగిన పేలుడులో కనీసం 14 మంది మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారు.
Convicts Escape : ఉరిశిక్ష పడిన ఇద్దరు కరడుకట్టిన ఉగ్రవాదులు కోర్టు ప్రాంగణంలోనే సినీ ఫక్కీలో తప్పించుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. వారిని ఛేజ్ చేయడానికి అధికారుల పెద్ద టీం ఇప్పుడు బయలుదేరింది.
Bangladesh: బంగ్లాదేశ్ లో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలింది. మంగళవారంనాడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల మందికి కరెంట్ లేకుండా పోయింది.
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్‌కతాకు వచ్చే బస్సు సర్వీసును పునరుద్ధరించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వీసులను ఇవాళ మళ్లీ ప్రారంభించారు. అగర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా, హరిదాస్‌పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మధ్య ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్‌లోని భారత…
నదిలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. నౌకమొత్తం వ్యాప్తించడంతో.. 40 మంది సజీవంగా దహనమైన విషాద ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తెల్లవారుజామున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోకతి సమీపంలోని సుగంధ నదిపై మూడు అంతస్తుల నౌక ప్రయాణం చేస్తుండగా.. మంటలు చెలరేగాయి.. నిమిషాల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో నౌక మొత్తం వ్యాపించాయి మంటలు.. ఈ ఘటనలో 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 40…