Earthquake: బంగ్లాదేశ్ లో భారీ భూకంపం.. పశ్చిమబెంగాల్‌లోనూ ప్రకంపనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. చిట్టగాంగ్‌లోని భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. కోల్ కతా సహా బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే రాష్ట్రంలో ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని పశ్చిమ బెంగాల్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.
Read also: Chandrababu Districts Tour: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన..
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. , ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు’ అని అధికారులు తెలిపారు. కోల్ కతా పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. కాగా, శనివారం ఉదయం 9.41 గంటలకు చిట్టగాంగ్‌లోని రామ్‌గంజ్‌లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో కదలికలు వచ్చినట్లు వెల్లడించారు. భూకంప కేంద్రం రామ్‌గంజ్ సమీపంలో ఉందని పేర్కొంది. నిమిషాల వ్యవధిలోనే చిట్టగాంగ్ ప్రావిన్స్‌లోని లక్ష్మీపూర్, చాంద్‌పూర్, కొమిల్లాలో భూమి కంపించింది. అదేవిధంగా, రాజ్‌షాహి, సిల్హెట్, ఢాకా, నౌఖాలీ మరియు కుస్తియాలో కూడా ప్రకంపనలు సంభవించాయి. భూకంపం వల్ల సంభవించిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
Earthquake of Magnitude:5.6, Occurred on 02-12-2023, 09:05:31 IST, Lat: 23.15 & Long: 90.89, Depth: 55 Km ,Location: Bangladesh, India for more information Download the BhooKamp App https://t.co/Sv8aV8laX2@Indiametdept @Dr_Mishra1966 @KirenRijiju @ndmaindia @Ravi_MoES pic.twitter.com/GuwGe69u3x
— National Center for Seismology (@NCS_Earthquake) December 2, 2023
Chandrababu Districts Tour: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన..
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?