AP Police: విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్ గంధం నరేంద్ర కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. 2 రోజుల క్రితం వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే ఆపాలని చెప్పటంతో కానిస్టేబుల్ నరేంద్ర తలపై దాడికి పాల్పడ్డాడు రామకృష్ణ అనే వ్యక్తి.. అయితే, ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన నరేంద్ర.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. దీంతో.. ఈ కుటుంబానికి అండగా ఉండాలని ఏపీ పోలీసులు నిర్ణయించారు.. దాంతో.. రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు డీజీపీ.
Read Also: Harish Rao: సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడ్డది మేము.. కేసీఆర్ లేకపోతే రైల్వే లైన్ లేదు
కాగా, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలో శనివారం రాత్రి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో విధులు నిర్వహిస్తూ ఒక తాగుబోతు చేసిన దాడిలో కానిస్టేబుల్ నరేంద్ర తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే ఆయన్ని విజయవాడ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్సలు చేయించి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కూడా తరలించాలని ప్రయత్నించారు.. కానీ, విధి నిర్వహణలో ఒక ముష్కరుడు చేసిన దాడిలో కానిస్టేబుల్ నరేంద్ర మృతి చెందారు.. కానిస్టేబుల్ నరేంద్ర మృతి తో వారి కుటుంబంలో అలాగే పోలీస్ శాఖలో విషాదఛాయలు నెలకొన్నాయి.. కానిస్టేబుల్ నరేంద్రకు ఒక బాబు, 8 నెలల పాప ఉన్నారు.. అతి చిన్న వయసులో విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలిచింది పోలీసు శాఖ.