దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం అభివృద్ధి నీటిమీద రాతలాగా మారింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. భక్తులకు కనీస సదుపాయాలు అందడం లేదు. సౌకర్యాల కల్సనకు ఏటా 100 కోట్లు కేటాయిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించినా అది అమలు కావడం లేదు. ఆలయ పీఠాధిపతులు వచ్చినప్పుడు హడావిడి చేస్తున్నారు. వేములవాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి చట్టబద్ధత లేదు. ఆలయానికి చెందిన 20 కోట్లు…