అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలో ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది.. దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో.. సోయం శ్రీసౌమ్య వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 8 మంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా వాహనంలో సినీ ఫిక్కీలో ఆమెను ఎత్తుకెళ్లారు.
పోలవరం ప్రాజెక్టు స్పీల్ వే మీదుగా 8, 60,042 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాఫర్ డ్యాం వద్ద 32. 80 మీటర్లుగ ఉంది గోదావరి వరదనీటి మట్టం. ఇక దేవీపట్నంలో గోదావరి ఉద్ధృతి కొనసాగుతుంది. దేవీపట్నం పోలీసు స్టేషన్, గండి పోచమ్మ ఆలయం నీట మునిగాయి. గండి పోచమ్మ అమ్మవారి ఆలయం గోపురాన్ని వరద నీరు తాకడంతో సమీపంలోని ఇళ్లుకూడా నీట మునిగాయి. దేవిపట్నం మండలాన్ని పోలవరం బ్యాక్ వాటర్ ముంచెత్తాయి. ఏజన్సీలో రహదార్లు…
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా పోలవరం కాఫర్ డ్యామ్ దగ్గర నీటిమట్టం 27 మీటర్లకు చేరింది. అంతకంతకు వరద పెరుగుతుండటంతో ముంపు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరదనీరు చేరింది. వరద నీరు పెరుగుతుండటంతో ఆలయంలోకి భక్తులను నిరాకరించారు. దేవీపట్నం మండలంలోని…