జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. తమ పార్టీ ప్రజాప్రతినిధుల తీరుపై ఫోకస్ పెట్టారు.. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారట.. ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేలపై వస్తున్న విమర్శలపై ప్రధానంగా ఈ సర్వే ద్వారా ఆరా తీస్తున్నారట జనసేనాని..
మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు పవన్ కల్యాణ్.. "మహానాడు... ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై.. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖా…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి ఫలించబోతోంది.. రాష్ట్రంలో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు, ఊళ్లపై పడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ.. ఎంతో మంది రైతుల, ప్రజల ప్రాణాలు తీసిన ఏనుగులను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు పవన్ కల్యాణ్.. అడవి ఏనుగులను కట్టడి చేయడానికి కుంకీ ఏనుగుల కోసం చర్చించి ఒప్పించారు.. ఇక, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఆరు కుంకీ ఏనుగులను అందించబోతోంది కర్ణాటక ప్రభుత్వం..
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూముల వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూములను ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో సంబంధిత శాఖల భూములు అక్రమణలకు గురవుతుంటే రక్షించలేని వారిని బాధ్యులను చేయాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసిందని గుర్తు…
పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీ పరిధిలోని భారత రక్షణ దళాల సిబ్బందికి చెందిన ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు మంజూరు చేయాలని ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.. ఈ నిర్ణయం మన దేశ భద్రత కోసం తమ జీవితాలను అంకితం చేసే మన రక్షణ దళాలు, సైన్యం, నౌకాదళం, వైమానిక దళం, పారామిలిటరీ, CRPF సిబ్బంది యొక్క అచంచల ధైర్యాన్ని గౌరవిస్తుందన్నారు.
నిన్న ప్రధాని మోడీ అమరావతికి వచ్చారు.. మొన్న వచ్చినప్పుడు (అమరావతి శంకుస్థాపనకు తొలిసారి వచ్చినప్పుడు) నీరు - మట్టి తీసుకొచ్చారు.. ఈసారి (అమరావతి రీలాంచ్) ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉంది.. హోంమంత్రి వంగలపూడి అనితపై గతంలో కొన్ని విమర్శలు చేశారు పవన్ కల్యాణ్.. అసలు తానే హోమ్ మంత్రి అవుతా అని పవన్ హెచ్చరించారు కూడా... ఇప్పుడు లేటెస్టుగా అనితపై పొగడ్తలు కురిపించారు పవన్.. ఏదైనా సమస్య వస్తే హోమ్ మంత్రిగా అనిత వెంటనే స్పందించి.. సమస్య పరిష్కారంపై దృష్టి పెడుతున్నారని పవన్ పొగడ్తలు కురిపించారు..
శ్రామికులే లేకపోతే దేశ నిర్మాణం లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్‌కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుంటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.. ఇక, మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు పవన్..