తిరుపతి - పళని బస్సు సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. భక్తుల అవసరాలను అర్ధం చేసుకున్నాను.. అందుకే తిరుపతి-పళని బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నాం అన్నారు..
కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, తిరుమల శ్రీవారికీ నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా ఫైర్.. 'సంప్రదాయాల ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి.. కానీ, రోజుకు దాదాపు 10 వేల VIP బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నారని.. మరోవైపు సాధారణ భక్తుల దర్శనాలను తగ్గించారు..
పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు, పెనుగొండ గ్రామాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. తమ కుటుంబ మూలాలున్న గ్రామాల అభివృద్దికోసం అవసరమైన మౌలికవసతుల కల్పనపై దృష్టి సారించారు.. అక్కడి సమస్యలను పేషీ అధికారుల ద్వారా తెలుసుకొనున్నారు. ఈనెల 28వ తేదీన పవన్ పేషీ అధికారులు అయా గ్రామాల్లో పర్యటించనున్నారు..
పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు చేసి, పాలనపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్..
Rishikonda Beach: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. రుషికొండ బీచ్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చి, బ్లూఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక శాఖ అధికారులను సమర్థంగా దిశానిర్దేశం చేసి,…
ఓ చిన్నోడికి మాత్రం.. ఏకంగా పవన్ కల్యాణ్ భుజనాలను ఎక్కే అవకాశం దక్కింది.. పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభ వేదికపైకి చేరుకున్న పవన్ కల్యాణ్.. ఆ సభలో ఓ పిల్లాడు.. ఎర్ర టవల్ తలకు కట్టుకుని కనిపించాడు.. దీంతో, ఆ బుడ్డోడిని స్టేజిపైకి రప్పించిన పవన్.. అతనని భుజంపై కూర్చోబెట్టుకుని ముద్దాడు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. కర్నూలు జిల్లా పర్యటనకు రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. తిరిగి హైదరాబాద్కు చేరుకోవడంతో పవన్ కల్యాణ్ పర్యటన ముగియనుంది..
జనసేన 12వ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా శుభాకంక్షలు తెలిపిన వారితో పాటు.. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదులు తెలుపుతూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.. సీఎం చంద్రబాబు మొదలు కొని.. జనసేన కార్యకర్తల వరకు ఎవరినీ వదలకుండా ప్రత్యేక ధన్యవాదులు తెలిపిన పవన్ కల్యాణ్ ట్వీట్లు కాస్తా ఇప్పుడు వైరల్గా మారిపోయాయి.