Deputy CM Pawan Kalyan: వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నాం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. సభ ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కొంతమంది మంత్రులు అధికారులు కూడా స్టాళ్లు పరిశీలించారు.. స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు, పవన్ కల్యాణ్… పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నాం అన్నారు.. అడవుల్లో కార్చిచ్చు ఆపే ప్రయత్నాలు చేయాలన్న ఆయన.. అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అంకారవు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. గతంలో ఇంటి అడ్రెస్ కావాలంటే అదిగో.. ఆ మర్రిచెట్టు పక్కవీధిలో అనేవారు.. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని ఆకాక్షించారు.. ఇక, అందరికి మనస్ఫూర్తిగా పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Indore: ‘నేను హత్యకు గురయ్యాను’’ సీబీఐ దర్యాప్తు చేయండి.. ఇండోర్‌లో వెలసిన పోస్టర్లు
మరోవైపు, పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టుపెట్టిన పవన్ కల్యాణ్.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.. భవిష్యత్ తరాలకి అందించాల్సిన గొప్ప బహుమతి శుభ్రమైన పర్యావరణం.. చెట్లు నాటి పచ్చదనాన్ని పెంచుదాం.. నీటి కాలుష్యాన్ని నివారిద్దాం నీటి వనరులను కాపాడుకుందాం.. వన్యప్రాణులను రక్షించుకుందాం.. జీవవైవిధ్యాన్ని పరిరక్షిద్దాం.. పర్యావరణాన్ని ప్రేమిద్దాం.. భవిష్యత్ తరాల భద్రతకై కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు.. ఇక, సుసంపన్నమైన ప్రకృతిని మన పిల్లలకు బహుమతిగా ఇద్దాం.. ఇది మన భూమి.. ఇది మన బాధ్యత అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..