Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్ భేటీ
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ..
- ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు అభినందనలు తెలిపిన జెన్పిఫర్..
- ఏపీలో పెట్టుబడులకు.. అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చ..
- రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని.. పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం ఉందని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్.. మంగళగిరిలోని పవన్ కల్యాణ్ నివాసంలో ఈ రోజు ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు అభినందనలు తెలియచేసి.. జ్ఞాపిక అందచేశారు యూఎస్ కాన్సల్ జనరల్.. ఇక ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ టీమ్‌ను సత్కరించారు పవన్.. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో.. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని.. పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని వెల్లడించారు పవన్ కల్యాణ్..
Read Also: CM Chandrababu: గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ఇక, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని వెల్లడించిన పవన్ కల్యాణ్.. వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూ.ఎస్. కాన్సల్ పొలిటికల్, ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలుటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే, సిబప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు. కాగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా తన శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. కీలక ఆదేశాలు జారీ చేస్తున్న విషయం విదితమే. గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో జరిగిన అవకతవకాలపై ఆరా తీస్తూ వస్తున్నారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!