Buddha Venkanna: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బుద్దా వెంకన్న రిక్వెస్ట్..
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బుద్దా వెంకన్న విజ్ఞప్తి..
- నేను ఒక కామన్ మెన్‌గా దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా..
- 2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buddha Venkanna: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఓ విజ్ఞప్తి చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.. నేను ఒక కామన్ మెన్‌గా దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా.. 2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.. చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డి అంటూ వ్యాఖ్యానించారు.. కొడుకుతో కలిసి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు.. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు.. వారి దాడులు, దారుణాలుచెప్పకుండా టీడీపీపై పడి ఏడుస్తున్నారని విమర్శించారు.. వారి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటీషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.. పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారు.. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, అనచరులు మరోచోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారు.. చిత్తూరు జిల్లా వీరప్పన్ గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నాం అంటూ హాట్ కామెంట్లు చేశారు.
Read Also: Rahul Gandhi : బడ్జెట్‌పై లోక్ సభలో తన అభిప్రాయాలను సమర్పించనున్న రాహుల్ గాంధీ
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఇక, వారి దోపిడీకి అడ్డం వస్తున్నారనే చంద్రబాబును ఓడించేందుకు వందల కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని విమర్శించారు బుద్దా వెంకన్న.. ప్రజల సొమ్మును దోచుకుని.. ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపథం చేశారు.. చంద్రబాబును ఓడించడం కాదు కదా.. ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారు అని ఎద్దేవా చేశారు.. చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్దిరెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు చేయాలి అని డిమాండ్ చేశారు.. చంద్రబాబుపై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీచ చరిత్ర వాళ్లది.. చిత్తూరు జిల్లా వీరప్పన్ ఆస్తులు మొత్తం అవినీతిమయం.. కాబట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలన్నారు.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సుమోటాగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నారు. చంద్రగిరి చెవిరెడ్డికి, తిరుపతి భూమనకు, నగరి రోజాకు వదిలి.. మిగతా ప్రాంతాలు మొత్తం పెద్దిరెడ్డే దోచుకున్నారు.. టీడీఆర్ బాండ్లలో భూమన, చెవిరెడ్డి, అతని కుమారుడు దాడులకు పాల్పడ్డారు.. టీడీపీ ఎమ్మెల్యే నానిపై దాడి చేసి చంపేందుకు యత్నించారని ఆరోపించారు. పెద్ది రెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేయాలి.. ఎర్రచందనం స్మగ్లర్లను మించి ఈ వీరప్పన్ దోపిడీ జరిగిందన్నారు.. ఒక్కరోజు ఐదు వందల మంది పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదులు చేశారంటే వారి దోపిడి ఎలా ఉందో అర్దం అవుతుందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఐడీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాస్తాను.. మరోసారి ఇంతటి అక్రమాలకు ఎవరూ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని.. పెద్దిరెడ్డికి ఇన్ని ఆస్తులు ఎలావచ్చాయో దర్యాప్తు బృందాలు నిగ్గు తేల్చాలని కోరారు బుద్దా వెంకన్న..
Read Also: Jewelry Shop Robbery: సినిమాను తలపించేలా.. ముంబైలో ముసుగులు ధరించి నగల షాపులో చోరీ.. (వీడియో)
మరోవైపు.. సుజనా చౌదరితో విబేధాల ప్రచారంపై స్పందించిన బుద్ధా.. సుజనాతో నాకు ఎటువంటి విభేదాలు లేవు.. కావాలనీ కొందరు ఈ ప్రచారం చేస్తున్నారు.. జిల్లాకు ఇన్ ఛార్జిగా ఉన్నప్పటి నుంచి సుజనాతో నాకు అనుబంధం ఉంది.. నన్ను టీడీపీ నగర అధ్యక్షుడిగా చేసింది కూడా సుజనా చౌదరే.. ఆనాడు కేశినేని నాని నన్ను వ్యతిరేకించినా.. సుజనా నన్ను ప్రోత్సహించారు.. మొన్న ఎన్నికల్లో పోటీ చేసే ముందు కూడా నాకు ఫోన్ చేసి నా అభిప్రాయం అడిగారు.. అటువంటి వ్యక్తితో నాకు విభేదాలు ఎందుకు ఉంటాయి..? పబ్లిసిటీ లేకుండా పది మందికి మంచి చేసే గుణం ఉన్న వ్యక్తి సుజనా చౌదరి.. నా జీవితంలో నేను ఆయనతో ఎప్పుడూ గొడవ పడను అని స్పష్టం చేశారు బుద్దా వెంకన్న.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!