అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో వరద బాధితులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వరద ప్రభావిత గ్రామాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హై పవర్ కమిటీ వేసి అందరికి న్యాయం చేస్తామన్నారు.
గుండెల నిండా కమిట్మెంట్తో పనిచేస్తాను అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మైసూర్వారి పల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు.. పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకం.. గత ప్రభుత్వ హయాంలో సంయుక్త.. మైసూర్ వారి పల్లి సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా... గ్రామస్థాయి నుంచి దేశభక్తి రావాలి అని పిలుపునిచ్చారు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొనబోతున్నారు.. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు.. రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న ఆయన.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు..
ఈ రోజు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యారణం శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. రాష్ట్రంలో చేపట్టబోతున్న నరేగా పనులు, ఈ నెల 23వ తేదీన గ్రామసభల నిర్వహణపై ముఖ్యంగా సమీక్షించను్నారు..
Pawan Kalyan: నేటి నుంచి కాకినాడలోని చేబ్రోలులో ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర జనవాణి కార్యక్రమం జరగనుంది. ఇవాళ్టి (సోమవారం) నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఎగురవేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు.. ఇక, కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్.. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలు గుర్తు చేసుకోవాలన్నారు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయితీలకు అందించే నిధుల విషయంలో కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు రూ.100, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.250 ఇచ్చేదని.. గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంతే మొత్తంలో నిధులు ఇచ్చేదని పవన్ తెలిపారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిధులను భారీగా పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.. గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు..