డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి ప్రజా భవన్ కి షిఫ్ట్ అవ్వనున్నారు. కాగా.. నిన్న రాత్రి ప్రజా భవన్ భట్టి విక్రమార్క పరిశీలించారు. రేపు ఉదయం 8.20కి ఆర్ధిక మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత.. ప్రజా భవన్ లో అధికారిక నివాస భవనంలో ఉండనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచారు సీఎం రేవంత్. కాగా.. ధరణి పై సమీక్ష చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ధరణి రద్దు చేస్తాం అని రేవంత్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ధరణి రద్దు..? సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.