భారత్ లోకి అక్రమంగా చొరబడే వారిపై ఉక్కుపాదం మోపనుంది సర్కార్. భారత్ లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను, ఇమ్మిగ్రేషన్ విషయాలను నియంత్రించడానికి రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం, 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందింది. ఏప్రిల్ 4, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితేష్ కుమార్ వ్యాస్…
US: అమెరికా మరోసారి విదేశీ పౌరులకు బిగ్ వార్నింగ్ ఇచ్చింది. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికాలో ఉంటున్న విదేశీ పౌరులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. దాడి, గృహహింస, ఇతర తీవ్రైన నేరాల వంటి నేరాల్లో అరెస్టులు జరిగితే, తక్షణమే వీసా రద్దుకు దారితీయవచ్చని, భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశించడానికి అర్హతను ప్రమాదంలో పడేస్తాయని స్పష్టం చేసింది
హైదరాబాదులో నేరాలు చేస్తున్న నైజేరియన్స్‌ను డిపోర్ట్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్ పోర్ట్ లతో ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వాళ్లను కూడా అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను ప్రారంభించిన ఆయన కార్యక్రమంలో ప్రసంగించారు. నైజీరియన్లను వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తారని భయంతో ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని సంచలన విషయాన్ని తెలిపారు.
భారతీయ విద్యార్థులకు ఇష్టపడే గమ్యస్థానాల్లో కెనడా ఒకటి. ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీస్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) డేటా ప్రకారం.. కెనడాలోని మొత్తం 226,450 మంది భారతీయులు ఉన్నారు. ప్రతి 10 మంది విదేశీయుల్లో నలుగురు భారతీయులే ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.