సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. ఇక్కడ నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలు మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ కావడంతో కూల్చి వేయాలని హైకోర్టు ఆదేశించింది.
HYDRA: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, తొలగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. హైడ్రా ప్రధానంగా చెరువులు, నదులు, ప్రభుత్వ భూములు, ఫుట్‌పాత్‌లు, రహదారులపై ఏర్పడ్డ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. నగరంలో ప్రణాళికా ప్రకారంగా అభివృద్ధి జరగాలని, అక్రమ ఆక్రమణలతో చెరువులు, బఫర్ జోన్ ప్రాంతాలు నాశనం కాకుండా ఉండాలని ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. గత కొంత కాలంగా హైడ్రా ఆక్రమణదారులపై ఉక్కుపాదం…
Footpath Encroachment : రంగారెడ్డిలోని బండ్లగూడలో మునిసిపల్ అధికారులు ఫుట్‌పాత్ ఆక్రమణలపై కొరడా ఝుళిపించారు. ఫుట్ పాత్‌పై వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పాదచారులు నడిచే పుట్ పాత్ ను ఆక్రమించుకొని వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేశారు వ్యాపారస్తులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదేశాల మేరకు బండ్లగూడ జాగీర్ మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫుట్ పాత్ కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో…
HYDRA: హైదరాబాదులోని అమీన్ పూర్‌లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిన వెంటనే, హైడ్రా కమిషనర్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. హైడ్రా అధికారులు ఈ కూల్చివేతల సమయంలో ప్రజల…
Demolition Drive: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘బుల్డోజర్ కార్యక్రమం’ దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. బుల్డోజర్ల సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు.