Demolition Drive: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘బుల్డోజర్ కార్యక్రమం’ దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. బుల్డోజర్ల సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఆక్రమణలు తొలగించే క్రమంలో రెండు నింపు ప్రాణాలు పోయాయి. తమ ఇంటిని అధికారులు కూలుస్తుంటే తట్టుకోలేని తల్లీకూతుళ్లు ఇంట్లో నిప్పంటుకుని ఆత్మాహుతి చేసుకున్నారు. కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం జరిగింది. వాస్తవానికి లోపల నిప్పు రేగిన సంగతి అధికారులు గమనించలేదు.
Read Also: Supreme Court : బెయిల్ ఇవ్వండి బిడ్డను కంటాం.. ట్విస్ట్ ఇచ్చిన కోర్టు
బుల్డోజర్ తో ఇంటిని కూల్చాక మంటలు బయటికి వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా అధికారులు ఖంగుతిన్నారు. ఒక గుడిసెను కూడా కూలుస్తుండగా ప్రమీలా దీక్షిత్, ఆమె కూతురు నేహా దీక్షిత్ ఇంట్లోనే మంటల్లో చిక్కుకున్నారు. అయితే వారిని గుడిసెలో ఉండగానే పోలీసులే తగలబెట్టారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు తామే నిప్పంటించుకుని ఆత్మహత్య చేుసకున్నారని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ కేసులో 13 మందిపై హత్య కేసు నమోదు చేశారు. అభియోగాలు మోపిన వారిలో సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, బుల్డోజర్ ఆపరేటర్ ఉన్నారు. వారిపై హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా గాయపరిచడం కింద అభియోగాలు మోపారు.
अतिक्रमण हटाने के नाम पर #कानपुर_देहात में अधिकारियों ने घिनौना कृत्य किया है. एक गरीब ब्राह्मण परिवार झोपड़ी बनाकर रह रहा था, वह भी इन दरिंदों से देखा नहीं गया. मां-बेटियों को मौत के मुंह में चले जाने दिया. कहां हैं सरकारी योजनाएं? इन्हें क्यों नहीं मिला आवास? @myogiadityanath pic.twitter.com/L2HDVzyFtn
— Alok Tripathi 🇮🇳🇮🇳 (@ALOKTRIPATHI171) February 14, 2023