అయోధ్య అత్యాచారం కేసులో నిందితుడైన సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొయీద్ ఖాన్ మల్టీ కాంప్లెక్స్‌పై బుల్డోజర్ చర్య ప్రారంభమైంది. ఈ కాంప్లెక్స్‌లో నడుస్తున్న బ్యాంక్ ను ఇంకో చోటుకు మార్చే వరకు అధికారులు వేచి ఉన్నారు.
Illegal Constructions: నందగిరి హిల్స్ లోని లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు లేవుట్ భూముల్లోకి చొరబడి తాత్కాలిక నిర్మాణల్లో పాన్ షాపు, కిరాణా షాపులు, మరుగుదొడ్లు కొనసాగిస్తున్నట్లుగా హైడ్రా కమిషనర్ ఎ. వి. రంగనాథ్ కు ఫిర్యాదులు అందచేశారు అక్కడి స్థానికులు. దాంతో ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. నందిహిల్స్ లేవుట్ భూముల్లో స్థానిక ప్రజలు చొరబడి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్లుగా నిర్ధారణ జరగడంతో..…
పాకిస్థాన్ దేశంలోని కరాచీలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాన్ని అక్కడి అధికారులు కూల్చివేసింది. కరాచీలోని సోల్జర్ బజార్‌లో 150 ఏళ్లకుపైగా చరిత్ర కల్గిన మారిమాత ఆలయం ఉంది. అయితే, షాపింగ్ ప్లాజా నిర్మించేందుకు గత శుక్రవారం గుర్తు తెలియని బిల్డర్ ఆలయాన్ని పడగొట్టారు. ఆలయ భూమిని షాపింగ్ ప్లాజా ప్రమోటర్‌కు రూ.7కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.
హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాల పునాదులు కదులుతున్నాయి. హెచ్‌ఎండీఏ అధికారులు తగ్గేదే లే అన్నట్లుగా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే తాజాగా బోడుప్పల్ లో రెండు, దమ్మాయిగూడలో ఒక అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. ఇప్పటివరకు 158 అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ, టాస్క్ ఫోర్స్ చర్యలు చేపట్టింది. గత కొన్ని వారాలుగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ యంత్రాంగం సంయుక్తంగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాద మోపుతున్నారు. అందులో భాగంగా బుధవారం రెండు మున్సిపాలిటీల పరిధిలో…