సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. త్రిలోక్‌పురిలో పలువురు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారు.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, బావమరిదిని దారుణంగా హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం జల్లెడపట్టి అరెస్ట్ చేశారు. కాగా.. హత్య ఘటనపై పోలీసులు విచారించగా.. వారిని హత్య చేయడానికి స్క్రూడ్రైవర్‌ను ఉపయోగించినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హాస్టల్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ముఖర్జీ నగర్‌లోని ఓ పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని ఈరోజు తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని చేరుకుని పరిశీలించారు. తెల్లవారుజామున 3.20 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతురాలు 29 ఏళ్ల స్వాతిగా గుర్తించారు. రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం…
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఏఎస్ఐపై ముఖేష్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మీట్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగింది. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ దినేష్ శర్మతో పాటు, బైక్ పై వెళ్తున్న అమిత్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం.. నిందితుడు ఓ ఆటోను బలవంతంగా ఆపి అందులో కూర్చోని తాను గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల దాడిలో ఏఎస్సై మరణించాడు. మరో…
ఢిల్లీలో శనివారం వాతావరణం చల్లబడింది. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో కనీసం 22 విమానాలను దారి మళ్లించారు. వాటిలో 9 విమానాలను జైపూర్‌కు, 8 లక్నోకు, 2 చండీగఢ్‌కు, వారణాసి, అమృత్సర్ మరియు అహ్మదాబాద్‌లకు ఒక్కో విమానాన్ని మళ్లించారు. ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రూట్లను మార్చిన విమానాలలో 9 ఇండిగో విమానాలు, 8 ఎయిర్ ఇండియా విమానాలు, 3 విస్తారా విమానాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఆమెను విచారించనున్నారు. ఇప్పటికే తీహార్ జైల్లో పలు ప్రశ్నలు సంధించారు.
ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై.. అర్ధరాత్రి బైక్‌పై సోదరీమణులతో కలిసి సురేందర్ ఇంటికి తిరిగి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టి వారి మీద నుంచి వెళ్లిపోయింది.
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. ఆ పార్టీని ముఖ్య నేతలు వీడుతున్నారు. గురువారం ఢిల్లీలో గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత రోహన్ గుప్తా భారతీయ జనతా పార్టీలో చేరారు.
మద్యం కుంభకోణంలో తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ క్రమంలో.. మంగళవారం కేజ్రీవాల్ భార్య సునీత తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. కేజ్రీవాల్ తన భార్య ద్వారా మరోసారి సందేశం పంపారు. ముఖ్యమంత్రి రెండు సందేశాలపై మంత్రి గోపాల్ రాయ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ మాకు రెండు సందేశాలు అందించారని ఆప్ నేత పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారన్నది కోర్టు ముందు కేజ్రీవాల్ వాదన వినిపించారు. అనంతరం.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.