జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను జైలు అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కవితకు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 23 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది
కవిత జ్యుడీషియల్ రిమాండ్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను జైలు అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది.
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ మధ్యాహ్నం 2.30 గంటలకు కేసును విచారించనున్నారు. ఏప్రిల్ 3న ఈడీ.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసులో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. రేపు ఉదయం 10:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్ట్ జడ్జి కావేరి బవెజా తీర్పు ఇవ్వనున్నారు. కాగా.. తన చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించింది. గత గురువారం నాడు కోర్టులో వాదనలు ముగిశాయి. కవిత మధ్యంతర బెయిల్ పై స్పెషల్ కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసింది.
Matchbox: ఢిల్లీలో దారుణం జరిగింది. అగ్గిపెట్టె ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇద్దరు టీనేజర్లు, ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన దేశ రాజధానిలోని తిమార్పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేడు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆప్ ప్రకటించింది.
ఒకటి, రెండు రోజుల వయస్సులోపు శిశువుల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా సీబీఐ బట్టబయలు చేసింది. ఢిల్లీ, హర్యానాలో జరిపిన దాడుల్లో 1.5 రోజులు, 15 రోజులు, ఒక నెల వయసున్న ముగ్గురు శిశువులను సీబీఐ ముఠా బారి నుంచి రక్షించింది. వీరిలో ఇద్దరు మగ శిశువులు, ఒక నెల వయసున్న ఆడ శిశువు ఉన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లో పోటీ చేయడంపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వయనాడ్ లో ఎందుకు పోటీ చేస్తున్నాడు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు కదా అని ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలే ప్రశ్నిస్తున్నాయని అన్నారు.