ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 34 ఏళ్ల వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైనట్లు అధికారి ఒకరు తెలిపారు. కారులోనే నిప్పంటించుకోవడానికి ప్రయత్నించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. వాహనంలో మంటలు చెలరేగకపోవడంతో అతనికి హైపోక్సియా ఒత్తిడి కారణంగా ముక్కు నుండి రక్తస్రావం అయ్యి ఊపిరాడక చనిపోయాడని వివరాలు తెలిపారు. మృతుడు లజ్‌పత్ నగర్ ప్రాంతంలోని దయానంద్ కాలనీకి చెందిన ధ్రువ్ మహాజన్‌గా అధికారులు గుర్తించారు. Delhi: శనివారం…
దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్నడూ లేనంతగా 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో.. రాజధాని ప్రజలు అటు ఎండలతో పాటు, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో.. ఢిల్లీ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నీరు కావాలని కోరగా.. అందుకు ఒప్పుకున్నారు. మరోవైపు.. సుప్రీంకోర్టు కూడా, ఢిల్లీకి 137 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేయాలని.. ఆదేశించింది. హిమాచల్ నుండి ఢిల్లీకి నీటిని సులభతరం చేయాలని…
ఢిల్లీలో శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
తీహార్ జైలులో ప్రత్యర్థి ముఠా సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఖైదీ కత్తిపోట్లకు గురయ్యాడు. హత్య కేసులో విచారణలో ఉన్న ఖైదీ హితేష్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో.. అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం 11:15 గంటలకు గోగి గ్యాంగ్‌కు చెందిన హితేష్, టిల్లు తాజ్‌పురియా గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హితేష్‌ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ఢిల్లీ నీటి ఎద్దడిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ( గురువారం ) కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాకు 137 క్యూసెక్కుల నీటిని తక్షణమే ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్‌ను కోర్టు కోరింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు కూటమిల మధ్య ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమిలు దెబ్బ దెబ్బగా సీట్లు సాధించాయి. బీజేపీ సొంతంగా ఎక్కువ సీట్లు సాధించకపోయినా.. మిత్ర పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.
ఎన్డీఏ పక్షనేత మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బలపరచగా.. కూటమి పక్ష నేతలంతా ఏకగ్రీవంగా మోడీని ఎంచుకున్నారు. మంగళవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది.
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ని కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది.
గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టొరంటో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు ఇమెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు.