OYO: ఓయోలో యువతి, యువకుడి మృతదేహాలు..అసలేం జరిగింది..?
- ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
- యువతి విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు
- యూపీలోని సంభాల్ జిల్లాలో ఘటన
- విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపనున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ యువకుడు తన నివాసానికి వందల కిలోమీట్ల దూరంలోని ఓ ప్రాంతానికి వచ్చాడు. అక్కడే ఉన్న ఓ అమ్మాయిని కలిశాడు. వారిద్దరూ ఐడీ ఫ్రూప్ చూయించి ఓయోలో రూమ్ తీసుకున్నారు. రూమ్ లోకి వెళ్లారు. అంతే మళ్లీ బయటకు రాలేదు. వారి గడువు ముగియడంతో హోటల్ సిబ్బంది వారి తలుపు తట్టారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో భయబ్రంతులకు గురైన సిబ్బంది కిటికీ ఓ పెన్ చేసి ఏం రూమ్ లోకి చూశారు. దీంతో వాళ్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. గదిలో యువకుడి వేళాడుతూ..కనిపించాడు. యువతి మంచంపై చలనం లేకుండా పడింది. దీంతో వెంటనే పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది.
READ MORE: UGC- NET2024: ఆదివారమే పేపర్ లీక్.. ఆ వెంటనే డార్క్ నెట్లో ప్రత్యక్షం..
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని గౌతమ్ నగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు, సంభాల్‌కు చెందిన 23 ఏళ్ల యువతి గురువారం మధ్యాహ్నం సదర్ కొత్వాలి ప్రాంతంలోని మొహల్లా ఫతేహుల్లా సరాయ్‌లో ఉన్న ఓయో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. హోటల్ మేనేజర్ యువకుడు, యువతి ఐడీ ప్రూఫ్ తీసుకుని గదిని కేటాయించారు. చెక్అవుట్ సమయం రాత్రి 11 గంటలు. సమయం ముగియడంతో హోటల్ మేనేజర్ అమిత్ గది తలుపు తట్టాడు. గది లోపల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మేనేజర్‌కు అనుమానం వచ్చింది. మెట్లు ఎక్కి కిటికీలోంచి చూడగా.. గది లోపల యువకుడి మృతదేహం వేలాడుతూ ఉండడం, మంచంపై బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడం కనిపించింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్పీ కుల్దీప్ సింగ్ గుణవత్, అదనపు ఎస్పీ శ్రీశ్చంద్ర, కొత్వాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలంలో క్షుణ్ణంగా విచారణ జరిపి ఆధారాలు సేకరించింది. అనంతరం బాలుడు, బాలిక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హోటల్ మేనేజర్ నుంచి సమాచారం తీసుకున్నారు. ఒక యువకుడు, యువతి ఐడీ ప్రూఫ్ ఆధారంగా మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. యువకుడు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, బాలిక నోటి నుంచి నురగ రావడంతో ఆమె విషం సేవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ హోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..