Viral Video: ఎప్పటికప్పుడు ఢిల్లీ మెట్రో గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. మొన్నటికి మొన్న ఢిల్లీ మెట్రో స్టేషన్లను తిరిగినందుకు గాను ఓ వ్యక్తి గిన్నీస్ బుక్ లో రికార్డుకెక్కాడు. మరోసారి కొందరు యువకులు మెట్రో టైన్ లో డోర్ క్లోజ్ కాకుండా చేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ఓ మహిళా.. తోటి ప్రయాణికుడి చెంప పగలకొట్టింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది.
Shabbir Ali: సీఎం కేసీఆర్‌కు షబ్బీర్ అలీ ఛాలెంజ్.. దమ్ముంటే ఆ వివరాలు బయటపెట్టాలి
మెట్రో అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రయాణికుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. తాజాగా ఈసారి తోటి ప్రయాణికుడి చెంప పగలగొట్టింది ఓ మహిళ. ఈ వీడియోలో ఒక మహిళ తన పక్కనే నిలబడి ఉన్న సహ ప్రయాణికుడిపై గొడవ పడుతున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా కంపార్ట్‌మెంట్‌లో ఉన్న అందరి ముందే అతన్ని చెంపదెబ్బ కొట్టింది.
Jamun Fruit: నేరేడు పండును వాళ్లు అస్సలు తినకూడదు.. తింటే ఆ వ్యాధులు వస్తాయి..!
ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా వేలల్లో వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియోలో గొడవకు కారణమేంటనేది తెలియలేదు. ఈ సన్నివేశాన్నంతా కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ఎవరో వీడియో రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. అయితే వారూ గొడవపడుతున్న.. అందులో ఉన్న వారంతా ఆపేందుకు ప్రయత్నించలేదు. అంతేకాకుండా చూస్తూ కూర్చున్నారు. ఈ వీడియో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తిని బహిరంగంగా ఎలా కొట్టగలరని ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమందేమో చుట్టూ ఉన్నవాళ్లు ఎందుకు ఆపలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Kalesh b/w a guy and a Girl Inside “Delhi Metro) – Girl slaps him too hard just think if it was vice-versa😀 pic.twitter.com/Y0RiKeYWem
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 3, 2023