Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కలుసుకునేందుకు వెళ్తున్న మహిళపై ఈ-రిక్షా డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తుమందు ఇచ్చి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడు మహమ్మద్ ఉమర్(24)ని ఉత్తర ఢిల్లీలోని కోట్వాలీ ఏరియా నుంచి అరెస్ట్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓవర్‌టేక్ చేసేందుకు బైక్‌కు దారివ్వలేదన్న కోపంతో క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓవర్‌టేక్ చేసే విషయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు క్యాబ్ డ్రైవర్‌తో గొడవపడ్డారు. అనంతరం ఆగ్రహంతో క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపారు.