డబ్బుల కోసం సొంత మేనల్లుడినే కిడ్నాప్ చేయించాడో వ్యక్తి. కానీ ఏం తెలియనట్టుగా పోలీసులతో కలిసి బాలుడిని వెతుకుతున్నట్టుగా నటించాడు. చివరికి కిడ్నాపర్లు చిక్కడంతో కిడ్నాప్ వ్యవహరం బట్టబయలైంది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. శాస్త్రి నగర్‌లో నివాసం ఉంటున్న సునీల్ కుమార్ కుమారుడైన ఏడేళ్ల బాలుడిని కొందరు దుండగులు బుధవారం కిడ్నాప్ చేశారు. అనంతరం సునీల్‌కు ఫోన్ చేసిన తమ కుమారుడిని కిడ్నాప్ చేశామని, అరగంటలో మూడు లక్షల…