2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితుడు కుల్దీప్ సెంగర్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. కుల్దీప్ సెంగర్ జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ సోమవారం విచారించింది.