Arvind Kejriwal: ఢిల్లీలో మరోసారి అధికారులు వర్సెస్ ప్రభుత్వం మధ్య వార్ ముదిరింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజిలెన్స్ మంత్రి అతిషి నివేదికను ఎల్జీ వీకే సక్సేనాకు పంపారు. అతనిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీకే గుప్తాను నియమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కేంద్రం ఆమోదం కోరినట్లు అధికారులు గురువారం తెలిపారు.