Pollution : దీపావళి సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల వాతావరణం విషపూరితం అవుతుంది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న అనేక ప్రాంతాల్లో కాలుష్య స్థాయి పెరిగి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది.
Weather Updates : రాజధానిలోని గాలి నాణ్యత శుక్రవారం చాలా పేలవంగా ఉంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 300 పాయింట్లకు పైగా నమోదైంది. అయితే గాలి వేగం పెరగడంతో శనివారం కాస్త ఊరట లభించే అవకాశం ఉంది.
ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా గాలి తీవ్రత పెరిగిపోతుండటంతో దేశ రాజధానిలోని 14 ప్రాంతాలలో ఏక్యూఐ (AQI) 400 కంటే ఎక్కువగా నమోదు అవుతుంది.
వాయి కాలుష్యంపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో రైతులను విలన్లుగా చిత్రీకరించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై పంజాబ్ ప్రభుత్వం రైతులను కారణంగా చూపించింది. బహిరంగంగా పంట వ్యర్థాలను కాల్చడమే ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు రైతులకు మద్దతుగా వ్యవహరించింది. Also Read:…
Delhi Air Pollution: ఢిల్లీలో ప్రమాదకర వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదురుగా వస్తున్నవి క్లీయర్ గా కనిపించకపోవడంతో నానా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నిన్న ఏయిర్ పొల్యూషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యంపై హర్యానా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల కాల్చివేతను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే అని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దీంతో పాటే ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబులపై నిషేధం విధించాలని ఆప్ ప్రభుత్వానికి సూచించింది.
Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇది పూర్తిగా ప్రజల్ని చంపేస్తోందని, ఎంత మంది పిల్లలు నెబ్యులైబర్లపై ఉన్నారు.? అంటూ ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేవ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.