ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తమ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. చాలా కాలంగా యాక్టివ్ గా లేని గూగుల్ అకౌంట్స్ అన్నింటినీ డిలీట్ చేయనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అకౌంట్స్ తొలగింపు ప్రక్రియ స్టార్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తమ యూజర్లకు గూగుల్ మెయిల్ ద్వారా వార్నింగ్ మేసేజ్ ను పంపిస్తుంది.