రువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి భారీ ఊరట లభించింది. ఆయన దోషి అని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పరువు నష్టం కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2001లో డిఫెన్స్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. 2002లో మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా పరువు నష్టం కేసు వేశారు.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Jeevitha Rajasekhar : యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ జీవిత దంపతులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ నోటిసుల్లో పేర్కొనింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆశోక్ గెహ్లాట్‌పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ నోటీసులను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జారీ చేసింది. సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి ఆశోక్ గెహ్లాట్ చేసిన ఆరోపణలకు గానూ కేంద్ర…
ప్రత్యర్థి సేన వర్గానికి చెందిన నాయకుడు రాహుల్ షెవాలేపై శివసేన(యూబీటీ) పార్టీ మౌత్‌పీస్ 'సామ్నా' ప్రసారం చేసిన పరువు నష్టం కలిగించే కథనాలపై శివసేన (యూబీటీ) నాయకులు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌లకు ఇక్కడి మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది.
రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో మల్లికార్జున్ ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది. జులై 10న కోర్టు ముందు హాజరు కావాలని సంగ్రూర్ జిల్లా కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.